K.G.F: Chapter 2 – హైదరాబాద్‌లో రాకీ భాయ్..

November 28th 2020, 4:30
KGF 2

K.G.F: Chapter 2- యావత్ సినీ ప్రపంచం చూపు కన్నడ పరిశ్రమవైపు తిప్పిన సినిమా ‘కె.జి.యఫ్’.. రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్‌తో సీక్వెల్ ‘కె.జి.యఫ్ -చాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నారు.

శ్రీనిధి శెట్టి కథానాయిక. అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్‌గా రవీనా టాండన్, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘కె.జి.యఫ్ 2’ షూటింగ్ ఆగస్టు నెలాఖర్లో పున:ప్రారంభమైంది.

ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగులో పాల్గొనడానికి యష్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఎయిర్ పోర్టులో తీసిన యష్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Loading...


Share your thoughts!