అడివి శేష్ హీరోగా, ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ్ల కథానాయిక.
26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిలటరీ అధికారిగా కనిపించడానికి అడవి శేష్ కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు.
ఈ సినిమాకు సంబంధించిన ‘లుక్ టెస్ట్’ వీడియోను మహేష్ బాబు విడుదల చేశారు. ‘మేజర్’ సినిమా గురించి, సందీప్ ఉన్నికృష్ణన్ తనను ప్రభావితం చేసిన విధానం గురించి, ఈ వీడియోలో శేష్ చెప్పాడు.
కథ గురించి చేసిన పరిశోధన గురించి తెలిపాడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ స్టోరీ ఈ చిత్రానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా మార్గనిర్దేశం కూడా చేసిందని పేర్కొన్నాడు.
Loading...
Share your thoughts!